ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్: 70మంది కోటీశ్వరులయ్యారు, 10,000మంది లక్షాధికారులు!!

 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్: 70మంది కోటీశ్వరులయ్యారు, 10,000మంది లక్షాధికారులు!!

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్ 16 నుండి 21వ తేదీ వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ చేపట్టింది. ఇందులో భాగంగా మొదటి మూడు రోజుల సేల్‌తో 70 మందికి పైగా వ్యాపారులు కోటీశ్వరులు, 10,000కు పైగా వ్యాపారులు లక్షాధిపతులు అయినట్లు తెలిపింది. 3,00,000 మంది అమ్మకందారులకు ఆర్డర్లు లభించాయని, ఇందులో 60 శాతం మంది టైర్ 2 నగరాలకు చెందినవారని తెలిపింది.

వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ ఈ ఏడాది 20 శాతం పెరిగి 3,000 పిన్‌కోడ్‌లకు చేరుకున్నట్లు వెల్లడించింది. గత ఏడాది బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఆరు రోజుల్లో ఉన్న సేల్స్ ఈసారి రెండు రోజుల్లో చూసినట్లు తెలిపింది.

class="deepLinkPromo" style="clear: both; display: block; margin: 0px 0px 5px; min-height: 60px; padding: 0px;">ఆ ఉద్యోగులకే కంపెనీలు మొగ్గు: భారీగా తగ్గిన నియామకాలు, పెరిగిన కాంట్రాక్ట్ ఉద్యోగాలు

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్..

బిగ్ బిలియన్ డే సేల్ మూడు రోజుల్లో ప్లాట్‌ఫాంలోని సెల్లర్స్‌కు మంచి బిజినెస్ వచ్చిందని, మొదటి మూడు రోజుల్లో మూడు లక్షల మందికి పైగా విక్రేతలకు ఆర్డర్లు వచ్చాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. మొదటి మూడు రోజుల్లో ఈఎంఐ, ఫ్లిప్‌కార్ట్ పే లెటర్ ద్వారా కస్టమర్లు చేసిన ఖర్చు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉందని తెలిపింది.

ఈ ఏడాది అత్యవసరమైన ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఏర్పడిందని పేర్కొంది. గృహోపకరణాలు, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించి ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయని వెల్లడించింది. సాధారణ రోజులతో పోల్చితే పండుగ సీజన్‌లో డిజిటల్ చెల్లింపుల ట్రాన్సాక్షన్స్ 60 శాతం పెరిగాయని తెలిపింది. కరోనా నేపథ్యంలో ఎక్కువమంది ఆన్ లైన్ షాపింగ్ కోసం మొగ్గు చూపారు.

టైర్ 2, టైర్ 3ల్లో పెరిగిన సేల్స్

సేల్ ప్రారంభించిన 48 గంటల్లో అమెజాన్ 5,000 మందికి పైగా సెల్లర్స్ రూ.10 లక్షల సేల్స్ నమోదు చేశారు. ఇందులో ఆర్డర్స్ పొందిన సెల్లర్స్‌లో 66 శాతం టైర్ -II, టైర్-III నగరాలకు చెందినవారని తెలిపింది. 1.1 లక్షలకు పైగా సెల్లర్స్ ఆర్డర్లు స్వీకరిస్తున్నారని తెలిపింది. చిన్న పట్టణాల నుండి 66 శాతం సెల్లర్స్, 91 శాతం మంది కొత్త కస్టమర్లు, 66 శాతం మంది కొత్త ప్రైమ్ సైనప్స్ ఉన్నట్లు తెలిపింది. 5 భాషల్లో షాపింగ్ నిర్వహిస్తున్నారని తెలిపింది.

అమెజాన్, స్నాప్ డీల్‌లోను టైర్ 2, టైర్ 3 నగరాల్లో..

ఇదిలా ఉండగా, అమెజాన్ ఇండియా మొదటి 48 గంటల్లో 1.1 లక్షల ఆర్డర్స్ పొందింది. స్నాప్ డీల్ అందుకున్న ఆర్డర్లలో 65 శాతం మెట్రోపాలిటన్ కానీ ప్రాంతాల నుండి ఉన్నాయని తెలిపింది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లో 35 శాతం ఆర్డర్స్ పొందింది. ఇటీవలి కాలంలో మెట్రో సిటీల కంటే టైర్ 1, టైర్ 2 కంటే నగరాల్లో సేల్స్ పెరిగినట్లు ఆన్‌లైన్ దిగ్గజాలు వెల్లడిస్తున్నాయి


ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్: 70మంది కోటీశ్వరులయ్యారు, 10,000మంది లక్షాధికారులు!! ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్: 70మంది కోటీశ్వరులయ్యారు, 10,000మంది లక్షాధికారులు!! Reviewed by Today neuz on October 22, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.