బిగ్‌బాస్: ఈ వారం ఆరుగురు నామినేషన్, వీరిలో డేంజర్ జోన్లో ఆ ఇద్దరే!

హైదరాబాద్: బిగ్‌బాస్ తెలుగు విజయవంతంగా ఆరు వారాలను పూర్తి చేసుకుంది. డ్రామా, ఫైట్లు, స్నేహం లాంటి అంశాలతో కంటెస్టెంట్లు వీక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే, బిగ్‌బాస్‌గా విజేతగా నిలవాలంటే ఆఖరు వరకు బరిలో నిలవాలి. అందుకే ఎవరి ఆట వారు చాకచక్యంగా ఆడుతున్నారు
ఆరుగురి నామినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరే..

అయితే, ఈ వారం ఎవరు బిగ్ బాస్‌హౌస్ నుంచి బయటికి వెళతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ వారం నామినేట్ అయిన వారి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, మీ కోసమే ఈ వివరాలు. నోయల్, అరియాన్, అవినాశ్, దివి, అభిజీత్, మోనాల్ వీరంతా ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. అయితే, అనాధికారిక పోల్ ప్రకారం.. వీరిలో ఎక్కువగా డేంజర్ జోన్‌లో ఉన్నది మాత్రం నోయల్, మోనాల్ అని తెలుస్తోంది. వీరిద్దరూ కూడా ఈ షోలో ఉండే అర్హత లేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

కుమార్ సాయి ఎలిమినేషన్‌పై అభిమానుల ఆగ్రహం

కుమార్ సాయి ఎలిమినేషన్ తర్వాత అటు నాగార్జున, ఇటు బిగ్‌బాస్ అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. బలమైన కంటెస్టెంట్లను బయటకి పంపిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఏ టాస్కులోనూ సత్తా చాటని వారికి కూడా రెండో అవకాశాలు ఇస్తున్నారని, వారు ఈ షోకు ఎలాంటి అదనపు ఆకర్షణ కాదని స్పష్టం చేస్తున్నారు.

మోనాల్, నోయల్ ఎలిమినేట్ అవుతారా? లేక ఒక్కరేనా?

అయితే, మరోవైపు బిగ్‌హౌస్‌లో మోనాల్, నోయల్ ఇప్పుడు బలమైన కంటెస్టెంట్లు అని, వారిని తక్కువ చేసి చూపడంపై వారి అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ వీరిద్దరిలో ఎవరైనా ఒకరిని హౌస్ నుంచి పంపేయడం లేదా? ఎలిమినేషన్‌ను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమ్మా రాజశేఖర్‌కు అన్యాయం జరుగుతుందా?

ఈ వారం ఎలిమినేషన్ రద్దు చేసినట్లయితే.. ఎలిమినేషన్ నుంచి తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న అమ్మా రాజశేఖర్‌కు అన్యాయం చేసినట్లవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఈ వారం ఎవరి ఎలిమినేషన్ ఉంటుందోనని బిగ్‌బాస్ షో అభిమానుల్లో ఉత్కంట నెలకొని ఉంది.