బ్యూటీ క్వీన్.. స్విమ్మింగ్ పూల్‌లో పునర్నవి అందాలు


పునర్నవి భూపాలం.. ఈ పేరులో ఏదో ఒక వైబ్రేషన్ ఉన్నట్టుంది. బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన తరువాత ఈ అమ్మడి క్రేజ్ అమాంతం వంద రెట్లు పెరిగినట్టు అనిపిస్తుంది. వెండితెరపై అడపాదడపా క్యారెక్టర్స్ పోషించిన పునర్నవిలో ఎన్నో కోణాలున్నాయని బిగ్‌బాస్ షో వల్లే తెలిసింది. లేడీ మోనార్క్ ట్యాగ్‌తో పునర్నవి చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. రాహుల్‌ను ప్రేమగా తిట్టే తిట్లు ఇప్పటికీ ఎవ్వరూ మరిచిపోలేరు. నాల్గో సీజన్ మొదలయ్యేందుకు సమయం ఆసన్నమవుతున్నా.. ఇంకా ఆ మూడో సీజన్ మూడ్‌లోంచి ఎవ్వరూ బయటకు రావడం లేదు.
బిగ్‌బాస్ మూడు సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్ల అందరి కంటే మూడో సీజన్ సభ్యులే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. వారే ఎక్కువ కాలం లైమ్ లైట్‌లో ఉన్నారు. ఎక్కువ క్రేజ్ వచ్చింది కూడా వీరికే. అలా వచ్చిన క్రేజ్‌ను సోషల్ మీడియా సాయంతో మరింత పెంచుకుంటూ పోతున్నారు.
బిగ్‌బాస్‌లో ఏర్పడిన స్నేహాలను కొనసాగిస్తూ.. బయట కూడా అదే విధంగా కలిసి మెలిసి ఉంటున్నారు. రాహుల్, వరుణ్, వితిక, పునర్నవి, అలీ రెజా, రవికృష్ణ, హిమజ, శివజ్యోతి వీరంతా తమ తమ గ్యాంగ్‌లతో నిత్యం హల్చల్ చేస్తూనే ఉంటారు. ఏదైనా ఒక ఈవెంట్ జరిగితే అందరూ హాజరవుతారు
అయితే పునర్నవి మాత్రం గత కొన్ని రోజులుగా ఎవ్వరితోనూ టచ్‌లో ఉండటం లేదు. తనకు తానే ఒంటరిగా ఉంటూ గతంలో జరిగిన ఈవెంట్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటోంది. తన సినిమా కెరీర్, బిగ్‌బాస్ స్పెషల్ మూమెంట్స్‌కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ హల్చల్ చేస్తోంది.
తాజాగా బ్యూటీ క్వీన్ అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. అంతకు ముందు రెట్రో లుక్‌లో ఉన్న పునర్నవి ఫోటోలు వైరల్ కాగా.. స్విమ్మింగ్ పూల్ వద్ద వయ్యారంగా కూర్చున్న పునర్నవి ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆమె కామెంట్ చేసినట్టుగా నిజంగానే బ్యూటీక్వీన్ అనిపించేలానే ఉంది.


బ్యూటీ క్వీన్.. స్విమ్మింగ్ పూల్‌లో పునర్నవి అందాలు బ్యూటీ క్వీన్.. స్విమ్మింగ్ పూల్‌లో పునర్నవి అందాలు Reviewed by Today neuz on May 27, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.